పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు షాకింగ్ న్యూస్. పవన్ తాజాగా నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఆడియో వేడుక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న వారందరికీ ఇది చేదు వార్తే. ఎందుకంటే ఆడియో వేడుక రద్దయింది. ఎలాంటి వేడుక నిర్వహించకుండానే నేరుగా ఆడియోను ఈ నెల 24న మార్కెట్లోకి విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
హీరో పవన్ కళ్యాణ్ ఆడియో వేడుక నిర్వహించడానికి విముఖత చూపడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అయితే పవర్ స్టార్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణం ఉందని, అభిమానులు ఇబ్బంది పడకూడదనే ఒక మంచి ఉద్దేశ్యంతోనే పవర్ స్టార్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
No comments:
Post a Comment